Login Username or Email Password Keep me logged in New user? Signup here Forgot Password or Username? Resend verification email
నా ప్రేమ ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ,ప్రాణంలా ప్రేమించిన వాళ్ళు పరాయి వాళ్ళు అయిపోతుంటే మాత్రం నిజంగా ప్రాణం పాయినట్టు ఉంటుంది.
నా ప్రేమ ఇలలోనే అందాలన్నీ ఆమె అందానికే దాసోహం, కలలా ఇలలో జరిగిన మాయో,ఇలలో, కలలో కన్న ఇంద్రజాలమా,ఏది ఏమైనా కాని తను, తన మాటలు, తన నవ్వులు, తన నడకలు, తన ప్రేమ, ఎప్పటికీ నా గుండెల్లో చెరగని ముద్ర వేసాయి.
నా ప్రేమ కనులు తెరచినా నువ్వే, కనులు మూసినా నువ్వే, కనులు ముసి కలలు కన్నా ప్రతి కలలోనూ నువ్వే, అందుకేనేమో నా ప్రేమ నీతో కలలోనే ముగిసిపోయింది.
నా ప్రేమ కన్నీటి పాటాల జీవిత పుస్తకం రాసుకుంది నేనే, చదువుతున్నది నేనే, జీర్నిచుకోలేని మనస్సు పొరమారుతుంది ప్రాణం పోయేంతలా.
నా ప్రేమ జీవిత కాలం అంటే ఎవరికైనా జనన మరణాల కాలంనాకు మాత్రం నీతో గడిపిన మాట్లాడిన కాలం.నీ ఆలోచన నేను కాకపోయినా, నా ప్రతి జ్ఞాపకం నువ్వే.
నా ప్రేమ ప్రేమ అయినా జీవితమైనా ఒక్కసారి చేయి జార్చుకున్నాక మళ్ళీ తిరిగి రావాలీ అంటే అంత సులభంగా దొరకవు.పొతే ప్రాణం పోవాలి లేదా జీవితాంతం జ్ఞాపకాలతో బ్రతకాలి.నీ కోసం కొట్టుకునే గుండెకి ఏం తెలుసు , నీ గుండెల్లో నేను లేను అని.
నా ప్రేమ నీవు రావని తెలిసినా నీకోసం ఎదురు చూస్తు ఉంటాను,నీవు నా ఎదుట లేకున్నా నిన్ను నే చూస్తూనే ఉంటాను,నేను నీకు గురుతుకి రాక పోయినా నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను.నేను నీ హృదయంలో లేకున్నా నిన్ను నా మనస్సులో కొలువుంచాను.నేను నీకు ఏమీ కాను అని తెలిసినా నేనే నువ్వైపోయాను.
నా ప్రేమ ఏమని వర్ణించను ప్రియ నిన్ను,నీ మోము చూసి ఆ చందమామ సైతం చిన్నపోయి మేఘాల చాటున చేరెనే. నీ కనులు చూచుటకై కలువ పువ్వులు సైతం వికసించెనే. నీ ఆధారాల జాలువ్రాలు పలుకులకు మధురాన్ని ఇచ్చుటకై అమృతం జనియిన్చెనే. ఆ ముత్యాలు సైతం నా పళ్ళ వరుసగా మారెనే. సముద్ర గర్భాన దాగిన శెఖం సైతం నీ ఖంటాన అమరెనా. నీ మేని సౌందర్యానికి పాల సముద్రం సైతం పులకరించెనా. నిన్ను వర్నిచుటకు ఆ భాషల్లోనూ మాటలు సరిపోవు, నా మదిలోని భావాలు సరి రావు.