loading

telugu jokes and sms

venkata suryakumar chinta
డాక్టర్ : ఏమి భయపడకు. నేను వున్నాను కదా

పేషంట్ : నాకు అదే భయం డాక్టర్. మీరు వుంటారు కానీ నేను ఉంటానా అనే నా భయం.
venkata suryakumar chinta
ఒక అమ్మాయి పెళ్లి చూపులకి వెళ్ళింది. 
ఆమెను పెళ్లి కొడుకుతో ఏకాంతం గా మాట్లాడడానికి రూమ్ లోకి వెళ్ళమన్నారు.
ఆ అమ్మాయికి చాల భయం వేసింది.
లోపలకి వెళ్ళగానే నీకు ఎంత మంది చెల్లెలు అన్న అని అంది. 
ఇప్పటి వరకు ఇద్దరు కానీ ఇప్పటి నుండి ముగ్గురు అన్నాడు.
venkata suryakumar chinta
ఒక సారి ఒక చెముడు పేషంట్ కి ఒక డాక్టర్ చెవుడు కి ఆపరేషన్ చేసాడు. ఆపరేషన్ ఐన తర్వాత డాక్టర్ పేషంట్ తో ఇప్పుడు మీరు అందరి మాటలు వినగలుగుతారు అన్నాడు.

పేషంట్ : ఇప్పుడు మీరు ఏమైనా మాట్లాడారా డాక్టర్?
venkata suryakumar chinta
పేషంట్ : డాక్టర్ నాకు మూడు నెలల నుండి బాగా దగ్గు వస్తుంది.

డాక్టర్ : మరి ఇన్నాళ్లు ఆలా సైలంట్ గా ఎలా వున్నావు?పేషంట్ : సైలెంట్ గా ఎక్కడ వున్నాను 

డాక్టర్? నేను అప్పటినుండి దగ్గుతూనే వున్నా.
venkata suryakumar chinta
ఒకసారి సల్మాన్ ఖాన్ పెళ్ళిచూపులకి వెళ్ళాడు. 

అతనిని  చూడగానే పెళ్లి కూతురు తల్లి కళ్ళు తిరిగి పడిపోయింది.

ఆమె లేచిన తర్వాత ఎందుకు ఆలా కళ్ళు తిరిగి పడావు అని అందరూ అడిగారు.

దానికి ఆమె 23  సంవత్సరాల క్రితం అతను నన్ను కూడా పెళ్లి చూపులు చూడడానికి వచ్చాడు అని అంది.
venkata suryakumar chinta
ఒక అబ్బాయి ఒక అమ్మాయికి తామర పువ్వు ఇచ్చాడు. ఆ అమ్మాయి అతనిని లాగిపెట్టి కొట్టింది. 

నన్ను ఎందుకు కొట్టావు అని అతను అడిగాడు. 

మరి నాకు ఈ పువ్వు ఎందుకు ఇచ్చావు అని అడిగింది.

మీరు బీజేపీ కి ఓటు వేయమని అడగడానికి ఇచ్చాను అందులో తప్పేమి వుంది అన్నాడు.

నేను నిన్ను కాంగ్రెస్ కి ఓటు వేయి అని అడగడానికి నా చేత్తో నీ చెంప చెల్లు అనిపించాను. అందులో తప్పేమి వుంది అని అంది.
venkata suryakumar chinta
ఆంటీ : డాక్టర్ నా కొడుక్కిఏమి వినపడడం లేదు.


డాక్టర్ : ఏమిటీ ఐదు రోజుల నుండి నీకు మోషన్స్ అవుతూ ఉంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరకి ఇంత లేట్ గా వస్తావా?
venkata suryakumar chinta
డాక్టర్   మీకు వచ్చిన రోగం వంశపారంపర్యం గా వస్తుంది.

పేషంట్ : అయితే నేను వెంటనే నా తాతని తీసుకుని వస్తాను.మీరు నా తాత కే ట్రీట్మెంట్ చేయండి డాక్టర్..
venkata suryakumar chinta
డాక్టర్ : మీ ఆయనకి బాగా ఎక్కువగా రెస్ట్ అవసరం. ఈ స్లీపింగ్ పిల్స్ ని తీసుకో.

పెళ్ళాం : ఆయనకి ఈ స్లీపింగ్ పిల్స్ ఎప్పుడు వేయాలి డాక్టర్?

డాక్టర్ : ఈ టాబ్లెట్స్ ఆయనకి కాదు మీరు వేసుకోవడానికి.
venkata suryakumar chinta
ఒక తాగుబోతు పేషంట్ తో  డాక్టర్ : ఆలా బాగా ఎక్కువగా మందు కొట్టడం ఆరోగ్యానికి చాల హానికరం. నేను నీతో ఎలా మందు తాగడం మాన్పించాలో డిస్కస్ చేయాలి.


పేషంట్ : సరే డాక్టర్ మనం ఈవెనింగ్ బార్ లో కూర్చుని ఆ విషయం గురించి డిస్కస్ చేదాం.