loading

breakup

Rahim Mounika
ఓ ఏకాంత బాటసారి ఆవేదన.... 😊

ఇంకా ఎన్నాళ్లు ఈ ఒంటరి పోరాటం..

నా కష్టాల కడలి లో ఒంటరి ప్రయాణం చేస్తున్నా...

చిన్న అలనై ఆగిపోతానో..

ఒప్పెంగే కెరటాన్నై తీరం తాకుతానో...

నేను నిద్ర పోయే ప్రతి రాత్రి నాకు చివరిదే అనిపిస్తుంది😔

కొన్ని రాత్రులు అసలు నిద్రే పట్టదు...😕

ఒకవేళ తెల్లారే దాకా ఉంటే..😒

ఆ ఉదయం మళ్ళీ కొత్తగా పుట్టినట్టు...👍

కానీ అదేంటో మళ్ళీ పాత రాత్రే....😔

ఇలా నా జీవితంలో లేక్క లేన్నన్ని కాల రాత్రులే....

ఏదో సాధిస్తానని తల్లి గర్భం నుండి పిడికిలి బిగించి బయటకు వచ్చాను... కానీ

ఏదీ సాధించకుండా చేయి చాచీ వెళ్ళిపోతానెమో..

ఈ ఒంటరితనం నన్ను అప్పుడు భయపెడూతూనే వుంటుంది...

బాధ పెడూతూనే ఉంది..

ఇంటి గోడలు వింతగా వెక్కిరిస్తాయి..

నేను నడిచే బాట సాగుతునే ఉంది..

ఎంత నడిచిన కాని నా గమ్యం రాదు..

ఎవరూ లేని ఏకాంత బాటసారిని నేను..

చూట్టు అందరూ వున్న... ఏకాకిని నేను..

అలసిన మనసు సేద తీరాలని...

నా కన్నులు శాశ్వతంగా విశ్రాంతి కోసం రెప్పలాడిస్తున్నాయి..😒😒😒

అర్ధం చేసుకుంటే నా జీవితం ఒక పాఠం... 😑

అర్ధం కాకుంటే ఒక వేదం..😊
.
.
.
.
.
మీ బాటసారి. ....🧘🚶🚶

.....
susan smith
blocked
Super Girl
Jitendra Vishwakarma
Jitendra Vishwakarma