Login Username or Email Password Keep me logged in New user? Signup here Forgot Password or Username? Resend verification email
నా ప్రేమ నీ తలపులు ఈటెల్లా నా మనస్సుని చీల్చి వేస్తున్నా, నీ తలపులనే శిలువలను భరిస్తూ నేడు జీవచ్చవాన్నైనాను, నీ తలపులు మాత్రమే శాస్వతం అని తెలియక నాకు అందని నీ నీడకై అన్వేషిస్తున్నాను. నీవు వేరెవరి కొరకో పుట్టినదానావు, నా ఆయుష్షును కలుపుకుని చల్లగా జీవించు.
నా ప్రేమ ఎప్పుడైతే నిన్ను ప్రేమించానో అప్పుడే, నా మనస్సు అనే కోవెలలో నిన్ను దేవతలా పెట్టి ప్రేమ అనే జ్యోతిని నమ్మకం అనే భక్తి తో వెలిగించాను, అది నాటి నుంచి పౌర్ణమి లా ప్రజ్వలిస్తూ, నా కళ్ళలో నీ రూపాన్ని చూపుతుంది.
నా ప్రేమ నా మదిలో మెదిలే భావాలకి ప్రతిరూపం నీ రూపం,అలంటి నీ రూపాన్ని ఊహించుకుంటూ ,నా ప్రతి అక్షరం లొనూ నింపుతున్నా నీ రూపాన్నే.
నా ప్రేమ కన్నీటిని దాస్తు కనులు మోసం చేస్తుంటే,బాధని నవ్వుతో పెదవులు మోసం చేస్తుంటే,భారమైన ఊపిరిని ఆపకుండా నా ప్రాణం కూడా మోసం చేస్తుంది.
నా ప్రేమ ఆ దేవుడు కనిపిస్తే ఒకటి అడగాలని ఉంది,జీవితాంతం కలవని వాళ్ళతో అసలు ఎందుకు పరిచయం చేస్తావు,ప్రేమించిన వారికి మనస్సులోని ప్రేమని చెప్పలేని వారికి ఎందుకు ప్రేమని పుట్టిస్తావు, ఇవన్నీ నీకు ముందే తెలిసినా ఎందుకు నన్ను నరకంలో పదేసావు అని అడగాలని ఉంది.
నా ప్రేమ ప్రియ నీకోసమే ఎదురు చూసే ఈ ప్రాణం ఎప్పటివరకు ఉంటుందో నాకు తెలియదు. కానీ ఈ ప్రాణం ఉన్నంతవరకు నువ్వే నా ప్రాణం.నేను పుట్టిన తరువాత నా తొలి పలుకు నీవు కాకపోయి ఉండవచ్చు.కానీ నీను మరణించే ముందు కచ్చితంగా అవుతావు నువ్వే నా చివరి పలుకు.
నా ప్రేమ నెమ్మది నెమ్మదిగా నాలో చేరి, తొందర తొందరగా నేనే నువ్వైనావు,జననమైనా మరణమైనా మరల మరలా జన్మిస్తా మరల మరలా మరణిస్తా.
నా ప్రేమ నెమ్మది నెమ్మదిగా నాలో చేరి, తొందర తొందరగా నేనే నువ్వైనావు,జననమైనా మరణమైనా మరల మరలా జన్మిస్తా మరల మరలా మరణిస్తా.
నా ప్రేమ ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ,ప్రాణంలా ప్రేమించిన వాళ్ళు పరాయి వాళ్ళు అయిపోతుంటే మాత్రం నిజంగా ప్రాణం పాయినట్టు ఉంటుంది.